Saturday, October 2, 2010

Common Wealth Games : Pride to India ?

గత కొంత కాలంగా పత్రికలలోనూ , ఎలక్ట్రానిక్ మీడియా లోనూ నిందలు పర నిందల్తోనూ పలక పక్షమూ ప్రతిపక్షమూ భారత దేశం పరువును మరింత బజారుకు ఈడ్చారు . ఎన్నో విషయాలలో భారత దేశాన్ని చాలా ముందుకు తీసుకుపోయాము అని పత్రికలలోనూ టీవీ ల లోను ప్రజా ధనాన్ని వృధా చెస్తూ ఫుల్ పేజి ప్రకటనలను ఇచ్చి గత నాలుగు సవంత్సరాల  సమయాన్ని గడిపేసి దేశ పరువు ప్రతిష్టలను మంట గలిపిన ఈ రాజకీయ నాయకులను ప్రజలు ఏ విధంగా నమ్మచ్చో అర్ధం కావడం లేదు . ప్రపంచ క్రీడా రంగంలో భారత స్థానం ఇంత ఘోరంగా ఉండడానికి ఇట్లాంటి రాజకీయాలే కారణం . వనరుల విషయంలో ధక్షిన ఆఫ్రికాకు మనం ఏ  రీతిలో తీసిపోయాం గత నాలుగు సవంత్సరాలలో ఐ పి ఎల్ 2 , వరల్డ్ సాకర్  ఇంకా ఎన్ని ఇట్లాంటి ఈవెంట్స్ యిచ్చినా జరపగలిగే సత్తా  వారిలో వుంది మరి మనం ఎందుకు దిగ జారిపోయము , ఎప్పటికీ ఇంతేనా వారికీ మనకు ఒక్కటే తేడా  చేసే పనిలో నిజాయితీ లోపించడం నిజామైన దేశ భక్తి లేక పోవడం లేదా ఏది చేసి ఆయినా ఎంత అవినీతి లో నుండి కూడా బయట పడగలం . చట్టం నుండీ తప్పించుకోగాలమనే దుస్సాహసమే ఇట్లాంటి పని చేయిస్తుంది . ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలు విదేశీయుల ముందు దేశ గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత వహించాలని సగటు పౌరులు ఆశిస్తున్నారు.

 

Thursday, September 30, 2010

Ayodhya Verdict

 ఈ రోజు అయోధ్య తీర్పు న్యాయబద్దంగానే వుంది . చరిత్ర మీద అవగాహన వున్న ఎవరైనా దీనిని అర్ధం చేసుకోగలరు .  ఏ దేశం మీద దాడి చేసిన వారైనా , అక్కడి దేవాలయాల మీద కట్టడాల మీద దాడి చేసి ద్వంసం చేసి వారి విజయాలకు గుర్తుగా వాటి స్థానే కొత్త కట్టడాలను నిర్మించేవరనేది చరిత్ర చెప్పే సత్యం .పురాతన కాలంగా వున్న దేవాలయం స్థానే మసీదు ను బాబర్ నిర్మించాడనేది చరిత్ర మనకు తెలియ చేస్తుంది . అట్లాంటప్పుడు మనం చరిత్ర ను తిరగ వ్రాసుకోవడం తప్పు కాదు కదా .
   మత విశ్వాసాల పరంగా చూసిన హిందువులకు ఫలానా గుట్ట మీదో కొండ మీదో దేవుడు వెలిసాడు అని అనాదిగా వస్తున్నన మత విశ్వాసం . ముస్లిములకైతే అట్లాంటి మత విశ్వాసాలు లేవు కదా అప్పుడు ఈ విషయం లో సర్దుబాటు చేసుకోవడం వారి మంచితనాన్ని తెలియచేస్తుంది తప్ప వారి ఓటమిని కాదు కదా .నేను వాస్తవంగా క్రైస్తవుడ్ని నాకు మీకు ఈ గడ్డ మనకు నచ్చిన దేవుడిని నమ్ముకునే స్వేచ్చ ఇచినందుకు తోటి హిందూ సోదరుల మనసుల్ని వారి మత విశ్వాసాలను గాయపరచ కూడదని నా విజ్ఞప్తి.