Saturday, October 2, 2010

Common Wealth Games : Pride to India ?

గత కొంత కాలంగా పత్రికలలోనూ , ఎలక్ట్రానిక్ మీడియా లోనూ నిందలు పర నిందల్తోనూ పలక పక్షమూ ప్రతిపక్షమూ భారత దేశం పరువును మరింత బజారుకు ఈడ్చారు . ఎన్నో విషయాలలో భారత దేశాన్ని చాలా ముందుకు తీసుకుపోయాము అని పత్రికలలోనూ టీవీ ల లోను ప్రజా ధనాన్ని వృధా చెస్తూ ఫుల్ పేజి ప్రకటనలను ఇచ్చి గత నాలుగు సవంత్సరాల  సమయాన్ని గడిపేసి దేశ పరువు ప్రతిష్టలను మంట గలిపిన ఈ రాజకీయ నాయకులను ప్రజలు ఏ విధంగా నమ్మచ్చో అర్ధం కావడం లేదు . ప్రపంచ క్రీడా రంగంలో భారత స్థానం ఇంత ఘోరంగా ఉండడానికి ఇట్లాంటి రాజకీయాలే కారణం . వనరుల విషయంలో ధక్షిన ఆఫ్రికాకు మనం ఏ  రీతిలో తీసిపోయాం గత నాలుగు సవంత్సరాలలో ఐ పి ఎల్ 2 , వరల్డ్ సాకర్  ఇంకా ఎన్ని ఇట్లాంటి ఈవెంట్స్ యిచ్చినా జరపగలిగే సత్తా  వారిలో వుంది మరి మనం ఎందుకు దిగ జారిపోయము , ఎప్పటికీ ఇంతేనా వారికీ మనకు ఒక్కటే తేడా  చేసే పనిలో నిజాయితీ లోపించడం నిజామైన దేశ భక్తి లేక పోవడం లేదా ఏది చేసి ఆయినా ఎంత అవినీతి లో నుండి కూడా బయట పడగలం . చట్టం నుండీ తప్పించుకోగాలమనే దుస్సాహసమే ఇట్లాంటి పని చేయిస్తుంది . ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలు విదేశీయుల ముందు దేశ గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత వహించాలని సగటు పౌరులు ఆశిస్తున్నారు.

 

0 comments:

Post a Comment